తెలంగాణ

కూకట్‌పల్లిలో ఘనంగా కాంగ్రెస్ నాయకుడు పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలుకేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

కూకట్‌పల్లిలో ఘనంగా కాంగ్రెస్ నాయకుడు పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలుకేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

జ నం న్యూస్ అక్టోబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలను కూకట్‌పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హేమ దుర్గా భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ చౌదరికి ఆశీస్సులు అందజేసి, జన్మదిన కేక్‌ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు, పార్టీకి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ నాయకుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, చలసాని నళినీకాంత్, రంగమోహన్, కిలారి బాబు, చావా శ్రీనివాస్, శివ చౌదరి, హరి ప్రసాద్, కళ్యాణ్, ఆదినారాయణ, ఆలీ, రమణ, హరిప్రసాద్ నాయుడు, పర్వేజ్, అశోక్, నవాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పిడికిటి గోపాల్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్