తెలంగాణ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా 📢 పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త బాధ్యతగా ముందుకు రావాలి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా 📢 పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త బాధ్యతగా ముందుకు రావాలి

జనం న్యూస్ 12 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జిల్లా నాయకులు తాలూకా నాయకులు, మండల నాయకులు గ్రామ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తిమన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.జోగులాంబ గద్వాల జిల్లాలోని 13 మండలాలు, 4 మున్సిపాలిటీలలో ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు మన పార్టీకి సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారం ప్రకటన ప్రజా సమస్యలపై స్పందనను అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయాలినాయకులు ఉన్న గ్రూపులకే పరిమితం కాకుండా మీ గ్రామాల గ్రూపులు, యువజన గ్రూపులు ఇతర ప్రజా గ్రూపుల్లో కూడా పార్టీ సందేశాలను ప్రజలకు చేరవేయాలి
పార్టీ సిద్ధాంతాలు బీసీ హక్కులు సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీకి కొత్తగా చేరాలనుకునే యువత మహిళలు ప్రజాసేవ చేయాలనుకునే వారికి పార్టీ గురించి వివరించి సభ్యత్వంలో భాగస్వాములను చేయాలి.ప్రతి నాయకుడు తన పరిధిలో పార్టీ ప్రచారాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ ఇతర నాయకులకు కూడా సహకరించాలి.ముఖ్యంగా గమనించాల్సిన విషయం:మన నాయకుల గ్రూపులో ప్రస్తుతం 27 మంది సభ్యులు ఉన్నప్పటికీ పార్టీ సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా ప్రతి ఒక్కరి నుంచి చురుకైన స్పందన అవసరం. కేవలం గ్రూపులో ఉండటమే కాకుండా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలిమీరు పంపే ఒక్క పార్టీ మెసేజ్ కూడా కొత్త వ్యక్తికి పార్టీ పరిచయం కావచ్చు మీ ప్రచారం ద్వారా కొత్త నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరవచ్చుమన లక్ష్యం ఒక్కటే గ్రామగ్రామాన తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేయడం మన పార్టీ ఎదగాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుంది జై బీసీ! జై తెలంగాణజై తెలంగాణ రాజ్యాధికార పార్టీఇట్లు,సింధనూర్ ఉప్పరి గంగాధర్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా

ఇ-పేపర్