జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి నవంబరు 11: కార్తీక శుద్ధ విదియ సందర్భంగా బుధవారం భగినీ హస్త భోజనం వేడుకను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు. సోదరి తన చేతితో వండి వడ్డించిన భోజనాన్ని సోదరుడు ఆప్యాయంగా స్వీకరించాడు. అనంతరం సోదరుడు సోదరికి తినిపిస్తూ తన ప్రేమను చాటుకున్నాడు. సోదరికి కానుకలు ఇస్తున్న సోదరుడు. సోదరుడికి భోజనం వడ్డిస్తున్న సోదరి. ఒకరికొకరు తినిపించుకుంటూ, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ తోబుట్టువులు ఈ వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఆప్యాయతను, అనుబంధాన్ని మరింత పెంచుతుందని పలువురు తెలిపారు.