తెలంగాణ

సీబీఎఫ్‌సీ హైదరాబాద్ రీజియన్ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడిగా వీరన్న చౌదరి నీరుకొండ నియామకం

సీబీఎఫ్‌సీ హైదరాబాద్ రీజియన్ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడిగా వీరన్న చౌదరి నీరుకొండ నియామకం

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వారి నోటిఫికేషన్ ప్రకారం శ్రీ వీరన్న చౌదరి నీరుకొండ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ రీజియన్ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం మూడు సంవత్సరాల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్తిస్తుంది. ఈ మేరకు సీబీఎఫ్‌సీ హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ గౌలికర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. చలనచిత్రాల సర్టిఫికేషన్ ప్రక్రియలో అడ్వైజరీ ప్యానెల్ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని, సమాజ విలువలకు అనుగుణంగా సినిమాలను పరిశీలించి సూచనలు అందిస్తారని తెలిపారు. వీరన్న చౌదరి నియామకంపై పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

ఇ-పేపర్