రెడ్డి సతీష్ అరోరా కో ఆర్డినేటర్ బి ఆర్ యస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం
జనం న్యూస్ నవంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ హౌసింగ్ బోర్డు పరిధిలోని రమ్యా గ్రౌండ్స్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి 2.39 ఎకరాలు ఇటీవల మెద్చల్ జిల్లా కలెక్టర్ మనో చౌదరి ఈ స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేయడం సంతోషకరమని ఈ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి ఎనలేనిదని కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరా అన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కె పి హెచ్ బి కాలనీ నలబై ఏండ్ల చిరకాల కోరిక మేరకు దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పునాదులు వేసి పనులు ప్రారంభించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డు స్థలాల పేరుతో ఈ భూమిని విక్రయించేందుకు బోర్డులు ఏర్పాటు చేసి వేలం వేసే ప్రయత్నం చేసిందనిఈ స్థలాన్ని విక్రయించకుండా కాపాడేందుకు ఎమ్మెల్యే ఎన్నో పోరాటాలు చేశారని ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారని గుర్తుచేశారు. ఈ పోరాటంలో విజయం సాధించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి ప్రజలు, మీడియా మిత్రులు అందించిన సహకారం ఎంతో కీలకమని, అందరి సమిష్టి కృషి వల్లే నేడు ఈ స్థలం విద్యాశాఖకు బదిలీ అయిందని తెలిపారు. ముఖ్యంగా మీడియా మిత్రులు తమ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రజా ఉద్యమానికి మద్దతుగా నిలిచారని వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు.ఎట్టకేలకు స్థలం విద్యాశాఖకు బదిలీ కావడంతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి మార్గం సుగమమైందని, త్వరలోనే పాఠశాల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.అదేవిధంగా కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించ కుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఉపయోగపడే విలువైన భూములను విక్రయిస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, వారి అవసరాలకు స్థలాలు లేకుండా పోయి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఈ విజయం కోసం సహకరించిన కేపీహెచ్బీ ప్రజలకు, స్థానిక నాయకులకు, మీడియా మిత్రులకు, స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేసిన జిల్లా కలెక్టర్ మనో చౌదరి కి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు.