Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని మండలం దంత గ్రామంలో బుధవారం జిల్లా యుటీఎఫ్‌ కార్యదర్శి, దంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొండు నారాయణ రావు పిలుపునిచ్చారు. బడి ఈడు గల బాల బాలికలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని, మీ పిల్లలను మన పాఠశాలలో చేర్పించి చక్కని విద్యకు మమ్మల్నే భాద్యులు చేయండి అని గ్రామంలో తల్లిదండ్రులను కలిసి గ్రామ ప్రభుత్వ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో విద్యార్థులను అడ్మిషన్‌లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.