

ఏసీపీ నర్సింలు చే రామనామాలు లిఖింపజేపించిన
సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
జనం న్యూస్, మే 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
రామ నామమే శాశ్వతమని, ప్రతి ఒక్కరిచే గత 26 సంవత్సరాలనుండి రామనామాన్ని లిఖింపజేపిస్తున్న గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు బుధవారం నాడు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఏసీపీ నర్సింలు కి శాలువ కప్పి రామకోటి పుస్తకాన్ని అందించారు. అందులో శ్రీరామ నామాలను లిఖించి భక్తిని చాటుకున్నారు ఏసీపీ నర్సింలు, ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ లోక కళ్యాణర్థం నేను తలపెట్టిన 1000కోట్ల లిఖిత రామకోటి మహాయజ్ఞంలో అందర్నీ బాగా స్వాములను చేయడమే నా లక్ష్యం అన్నారు. పీఠాదుపతులు, రాజకీయ నాయకులతో పాటు అన్ని శాఖలకు చెందిన వారు ప్రతిరోజు రామకోటి సంస్థ అందించిన పుస్తంలో రామ నామాలు లిఖిస్తున్నారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా లాంటి ప్రాంతాలలో మా ద్వారా రామనామాన్ని లిఖిస్తున్నరన్నారు.
