జనం న్యూస్ 14 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా మల్డకల్ మండలం రోడ్ల పొడవుగా ఉండే గుంతలకు మట్టిని నింపాలి రోడ్ల పొడవునా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి.రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలను అరికట్టాలి సిపిఐ మల్దకల్ మండల కార్యదర్శి కామ్రేడ్ రంగన్న విన్నపంమల్దకల్ మండలంలో డిసెంబర్-4-2025న మల్దకల్ జాతర సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.అలాగే జాతరను తిలకించడానికి, మొక్కుబడులు చెల్లించుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో నలుమూలల ప్రాంతాల నుంచి మల్దకల్ కు భక్తులు/ప్రజలు వస్తూ పోతుంటారు కావున.ఈ సందర్భంగా ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా రోడ్డుకి ఇరువైపున ఉన్న చెట్ల కొమ్మలను, ముళ్ల కొమ్మలను తొలగించి అలాగే రోడ్ల పొడవున అక్కడక్కడ గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరగడానికి సూచికగా పెద్ద ఎత్తున ఉన్నాయి కావున అలాంటి గుంతలకు మట్టిని నింపి మల్దకల్ కు వచ్చి పోయే కొత్త ప్రాంతాల వారికి ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు. గట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో గారికి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మల్దకల్ మండల కార్యదర్శి కామ్రేడ్ రంగన్న ఎల్కూర్. మహేశ్వర రాకేష్ ఎల్కూర్. తాటికుంట భాస్కర్. పవన్. పరశురాముడు.గణేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.


