జనం న్యూస్ మార్చి 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎం ఎన్ ఆర్ ఈ జీ ఎస్ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో మండల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీ బృందం సమీక్ష చేపట్టింది.గ్రామాల్లో చేపట్టిన పనుల అమలు, ఖర్చు చేసిన నిధులు, కార్మికులకు చెల్లించిన వేతనాలు, పనుల నాణ్యత వంటి అంశాలపై రికార్డులను పరిశీలించి ప్రజల సమక్షంలో అధికారులు వివరాలు వెల్లడించారు. గ్రామస్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, ఫిర్యాదులను స్వీకరించి వాటిని నమోదు చేశారు.ఈ సందర్భంగా ఏపీడీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతను నిర్ధారించేందుకు సామాజిక తనిఖీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రజలు పనులపై ఎలాంటి సందేహాలు లేదా సమస్యలు ఉన్నా నిర్భయంగా తెలియజేయాలని, వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి నర్సింహారెడ్డి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి పుష్పల, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డీటీసీ శ్రీధర్, అంబుడ్స్‌మన్ నాగరాజు, ఎస్ఆర్‌పీ మహేశ్వర, ఎంపీఓ రంజిత్ కుమార్, ఏపీవో అనిత, పీఆర్‌ఏ శ్రీలత, టీఏలు, ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు….


