Listen to this article

జనం న్యూస్ 12 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

నూతన ప్రజాప్రతినిధులకు జిల్లా స్థాయి శిక్షణ.శిక్షణకు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు మరియు సర్పంచ్‌లకు జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం గురువారం ఉదయం 10 గంటలకు, గద్వాల పట్టణంలోని, బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తో కలిసి స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం సక్రమంగా, వ్యవస్థీకృతంగా జరగేలా పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు సరైన సదుపాయాలు, సీటింగ్ వ్యవస్థ, తాగునీరు, పార్కింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు సముచితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెయిన్ రోడ్ పై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా తగిన బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.జిల్లాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ పరిశీలనలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయం, జోగుళాంబ గద్వాల్ జిల్లా.