_ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ధ్యేయం
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రూ.81.90 లక్షలతో నీటి ట్యాంకు ప్రారంభం_
మంత్రి వాసంశెట్టి సుభాష్_ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం గ్రామీణ మండలం అన్నయ్యపేటలో రూ.81.90 లక్షలతో నిర్మించిన ఎత్తు నీటి నిల్వ ట్యాంకును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పనులు చేపడుతున్నామన్నారు. అన్నయ్యపేటలో 40 వేల లీటర్ల సామర్థ్యంతో, 4017 మందికి, 400 కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఈ ట్యాంకు నిర్మించామని తెలిపారు. దీని ద్వారా గ్రామ ప్రజలకు నిరంతర తాగునీరు అందుతుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించామన్నారు.రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని,రోడ్లు,తాగునీరు,మురుగు కాలువలు,విద్యుత్,పారిశుధ్యం మెరుగుదలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అక్కల రిశ్వంత్ రాయ్,జనసేన బాధ్యులు పోలిశెట్టి చంద్రశేఖర్, గ్రామీణ మండల తెలుగుదేశం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, ప్రత్యేక అధికారి మణిదీప్, గ్రామీణ నీటి సరఫరా సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు టీ చైతన్య కుమారి,ఇంజనీరింగ్ సహాయకులు ఎం విజయ భాస్కర్,ఎన్ లక్ష్మీ, ఉప ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి,శాక బాబి,కొత్తపల్లి అరుణ, సలాది శ్రీను, ఆకేటి సురేష్, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.