
జనం న్యూస్ 28 అక్టోబర్ 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి: మంగళవారం మధ్యాహ్నం ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు ట్రైన్ కలెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్ రోహిత్‌ను ఉమ్మడి కరీంనగర్–హనుమకొండ జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇంగెభాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు
ఈ సందర్భంగా రోహిత్‌కు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంగె భాస్కర్ మాట్లాడుతూ, రోహిత్ ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నంతకాలం మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రైతుల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ, వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సేవలు సజావుగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దానికి స్పందించిన అదనపు ట్రైన్ కలెక్టర్ ఇన్చార్జి తహశీల్దార్ రోహిత్ఈ కార్య క్రమంలో అంబరి శ్రీనివాస్, కోదాటి మాధవరావు, జీలుగుల మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు