
నందలూరు( జనం న్యూస్ ప్రతినిధి)సెప్టెంబర్ 17 నందలూరు మండలం: నాగిరెడ్డిపల్లి గ్రామంలోని అరవపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ్ రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించి,వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం వల్ల దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబానికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎంపీ మేడా రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి తన వంతు సహాయంగా ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రజల కష్టాల్లో వారికి అండగా నిలవడమే తన బాధ్యత అని ఎంపీ మేడా రఘునాథ రెడ్డి తెలిపారు.