
జనం న్యూస్ మే 14,వికారాబాద్ జిల్లా పూడూరు మండల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం సంస్థ (ఆత్మ) వారి ఆధ్వర్యంలో ఈరోజు గురువారం నాడు పూడూర్ మండలంలోని పూడూరు రైతు వేదికలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాల మీద రైతులకు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది . ఇఫ్కో వారు పాల్గొని నానో యూరియా, డీ ఎ పి, జింక్, కాపర్, లాంటి ఎరువుల వాడకంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ నుంచి శాస్త్రవేత్తలు ఉషా కిరణ్,రమ్య, ఎరువుల సమతుల్యత పై వివరిస్తూ భూసార పరీక్షల ప్రాముఖ్యత తెలుపుతూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల ఎలా వాడాలి అనే విషయం గురించి తెలపడం జరిగింది. ఉద్యాన శాఖ అధికారి సంతోష్ కుమార్,ఆయిల్ పామ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , పూడూరు పిఏసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ , మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పిఏసిఎస్ డైరెక్టర్లు, ఆత్మ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ మరియు ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.