
జనం న్యూస్; 11 మే సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ ;సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయంలో ఆదివారం జరిగిన అష్టావధానంలో అవధాని వజ్జల శరత్ కుమార్ శర్మ పద్యాలతో అలరించారు. పృచ్చకులుగా నిషిద్దాక్షరి పెందోట వెంకటేశ్వర్లు, వర్ణన ఉండ్రాళ్ళ రాజేశం, సమస్య కాల్వ రాజయ్య, దత్తపది దుడుగు నాగలత, ఆశువు మచ్చ అనురాధ, వ్యస్తాక్షరి నల్ల అశోక్ తదితరులు అడిగిన అంశాలపై పద్యాలు అప్పటికప్పుడే చెప్పాడు. తెలుగు భాషలో అవధానం గొప్పదని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ అన్నారు.