
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మే 08. 05. 2026 జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, అనసూయమ్మకు ఘన నివాళులు ఝరాసంగం/ జహీరాబాద్: వేదభక్తి, దైవభక్తిని ప్రజల్లో పెంపొందించిన బర్దిపూర్ మాతృమూర్తి మాతృశ్రీ అనసూయ మాత ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ బీజేపీ నాయకులతో కలిసి బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఇటీవల శివైక్యం చెందిన మాతృమూర్తి అనసూయ మాత సమాధి స్థలమైన ఆనంద మండపాన్ని దర్శించుకుని పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి, సిద్దేశ్వరనంద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన అమ్మ మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. అమ్మ చూపిన మార్గాన్ని కొనసాగిస్తూ, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల భాస్కర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి, పండరినాథ్, ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్, కోట శ్రీనివాస్, బీ. కృష్ణ, వడ్ల సంగమేశ్వర్, బోయి ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మకు श्रद्धాంజలి అర్పించారు.