
జనం న్యూస్ నవంబర్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణస్థానిక సంస్థలు ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమి ప్రభుత్వంపై ఓటర్లు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సమిష్టి కృషి ఫలితంగా ఓట్లు బదిలీ సక్రమంగా చేయడం వల్ల భారీ విజయం సాధించామని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కన్నా ఎక్కువ శాతం స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగించడం ఇది కూటమి ప్రభుత్వంపై విశ్వాసం నమ్మకంతో ప్రజలు ఇచ్చిన తీర్పుని నాగ జగదీష్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సంక్షేమ అభివృద్ధి సాగునీరు త్రాగునీరు పరిశ్రమలు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షలు ఉద్యోగాలు కోసం నిరంతరం శ్రమించి రాష్ట్రానికి 23 లక్షల కోట్లు పెట్టుబడులు రావడంతో ఇప్పటికే 7 లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావడంతో యువతి యువకుల్లో కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో ఓట్లు వేసి జగన్ రెడ్డికి మరోసారి బుద్ధి చెప్పారని నాగ జగదీష్ అన్నారు. తుఫాన్లు పై తుఫాన్లు రాష్ట్రా ప్రజలను ఇబ్బందులు పెట్టినప్పటికీ రైతాంగానికి తీవ్రం నష్టం వాటిల్లినప్పటికీ చంద్రబాబు పై నమ్మకంతో వైసిపి చేసిన దుష్ప్రచారాలను తిప్పి కొట్టి కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నందుకు ఓటర్లకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేటర్లు, జిల్లా ప్రజా పరిషత్,మండల ప్రజాపరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఓటర్లు ఏకపక్షంగానే కూటమికి అండగా నిలిచి విజయం సాధించారని, దీనిలో ముఖ్యంగా జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జులు తెలుగుదేశం జనసేన బిజెపి శ్రేణులు ఐక్యమత్యంగా వ్యూహ రచన చేసి అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చినందుకు ఓ టర్ మహాశయులకు శతకోటి వందనాలు నాగ జగదీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ కోట్ని రామకృష్ణ బోడి వెంకటరావు కుప్పిలి జగన్ తదితరులు పాల్గొన్నారు.//