
జనం న్యూస్ నవంబర్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం అరబుపాలెం గ్రామంలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అసలు దీపావళి అంటే దీప అంటే దీపం ఆవలి అంటే వరుశ దీపాల వరుస అనే అర్థం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే దీపావళికి ప్రత్యేకమైన ప్రసిద్ధిఉంది. అదే నరకాసురుని వద. నరక చతుర్దశిని చాలా ముఖ్యంగా జరుపు కుంటాం. నరకాసురుడు భూదేవి కుమారుడు అతను బ్రహ్మనుంచి వరాలు పొంది శక్తివంతుడయ్యాడు. అహంకారంతో దేవతలను మునులను హింసించాడు. 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దేవ మాత ఆదితి యొక్క కుండలాలను కూడా తీసుకువెళ్లాడు. దేవతలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి వేడుకున్నారు. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి గరుడు వాహనంపై యుద్ధానికి వెళ్లారు. నరకాసురుడికి ఒక శాపం ఉంది అతని తల్లి భూదేవి చేతిలో తప్ప అతనికి మరణం అంటూ ఉండదు. ఇక సత్యభామ దేవి స్వయంగా భూదేవి అంశ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పినట్టుగా నటించగా సత్యభామ దేవి బాణంతో నరకాసురుని సంహరించింది. చనిపోయే ముందు నరకాసురుడు ఆయన చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఆరోజును ప్రజలు దీపాలతో ఆనందంతో జరుపుకోవాలని కోరాడు. అదే నరక చతుర్దశి గా మారింది. అందుకే ఆరోజు తెల్లవారుజామునే నువ్వుల నూనెతో తలంటు స్నానం అభ్యంగన స్నానంచేస్తాం ఇది కేవలం ఆచారం మాత్రం కాదు నరకాసురుని యొక్క చెడు యొక్క శక్తిని కడిగేసి శుద్ధి అవటానికి ప్రతీక. ఆరోజు టపాసులు కాల్చడం కూడా ఆనందానికి గుర్తు. ఈ కథలో గెలిచింది ఒక మహిళ తాలూకా శక్తి సత్యభామ లేకపోతే ఆనాడు విజయం లేదు. అనగా స్త్రీ లేనిదే విజయం లేదు అని అని అర్థం. అందుకే సాయంత్రం దీపాలతో ఇంటిని అలంకరించుకొని చెరుకు గడల దివ్యలతో పిత్రులను తలుచుకొని టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని ప్రజల నోటిని తీపి చేస్తూ సంతోషాలతో సంబరాలు జరుపుకున్నారు.//