జనం న్యూస్,పీబ్రవరి 05,కంగ్టి శ్రీనివాసరావు, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని సీదుల యమునవా సర్వే నంబర్ 123 లో రాళ్ల కటాల పనిని బుధవారం దాదాపు 220 మంది ఉపాధి హామీ కూలీలు హాజరైనట్లు జబకార్డ్ లను పరిశీలించరు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధి హామీ పనికి జబకార్డ్ లో పేరు ఉన్నవారే రావాలని కూలీలకు సూచిచారు.ప్రభుత్వం ఆదేశించిన కొలతల ప్రకారం పని చేయాలనీ దిశా నిర్దేశం చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రొదున్న తొందరగా వచ్చి ఎండ తీవ్రత అవ్వకముందు పని ముగిచుకొని వేళలని అన్నారు.ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్ విష్ణు దాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.