జనంన్యూస్. 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.దేశంలోనే అతిపెద్ద రైతు సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదటి తెలంగాణ వాసి కొండల సాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ మరియు మాజీ నగర అధ్యక్షులు ఎండల సుధాకర్ సన్మానించడం జరిగింది. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి రెడ్డి అంచలంచలుగా ఎదిగి దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు జాతీయ అధ్యక్షులుగా కావటం మన జిల్లాకే గర్వకారణం అని ఈ సందర్భంగా స్వామి యాదవ్ తెలిపారు.
భారతీయ కిసాన్ సంఘ్ యొక్క 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సాయి రెడ్డి సేవలను స్వామి యాదవ్ కొనియాడారు. సాయి రెడ్డి నేతృత్వంలో దేశంలోని అన్ని గ్రామాలకు భారతీయ కిసాన్ సంఘ్ విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.