జనం న్యూస్ మార్చ్ 6 గొలుగొండ రిపోర్టర్ పోట్ల రాజా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి, వాటి పురోగతిపై గొలుగొండ ఎస్సై రామారావు, కృష్ణదేవిపేట ఎస్సై తారకేశ్వరరావు లకు అవసరమైన సూచనలు అందించారు.స్టేషన్ ప్రాంగణంలో సీజ్ చేసి ఉంచిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకుని, వాటికి సంబంధించిన కేసుల వివరాలను ట్యాగ్ చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు రవాణా మార్గాల్లో ఆకస్మిక తనిఖీలు (డైనమిక్ చెకింగ్) నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే, గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 1972 ద్వారా సమాచారం అందించాలనే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ గారు పేర్కొన్నారు.అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు, ప్రధాన కూడళ్ల వద్ద మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ప్రజల సహకారంతో ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పోలీసులు తరచూ పర్యటించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ లను నూతన భవనాలను జిల్లా ఎస్పీ సందర్శించి, భవనం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.ఈ కార్యక్రమలలో జిల్లా ఎస్పీ గారి తో పాటు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.రేవతమ్మ,గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్సైలు ఎం.రామారావు, వై.తారకేశ్వరరావు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయం, అనకాపల్లి.