జనం న్యూస్ 06 నిజామాబాదు. సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ.మండలకేంద్రంలో గురువారం రోజునా బీజేపీ కార్యకర్తలు మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీలలో బిజెపి అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే రానున్న కాలంలో కాంగ్రెస్.బిఆర్ఎస్ పార్టీకి లోకల్ ఎలక్షన్స్ లో కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయని ఆయన తెలిపారు. కార్యకర్తలు అందరూ ఇదే తరహాలో కలిసి ఉండి వార్డ్ మెంబర్ నుండి సర్పంచి వరకు ఎంపీటీసీ నుండి జడ్పిటిసి వరకు గెలిచి తమ సత్తా చాటుదామని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో సిరికొండ బీజేపీ అధ్యక్షుడు సంజీవ్. సీనియర్ నాయకులు. రాజేశ్వర్ లంబాగౌడ్.సతీష్.తదితర విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.