జనం న్యూస్. మార్చి6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) గత ఏడు నెలల క్రితమే గణపతి కంకర క్రషర్ పై హత్నూర గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేశామని. పూర్తి విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదిక అందజేశామని స్థానిక తహసిల్దార్ పర్వీన్ షేక్ తెలిపారు.కంకర క్రషర్ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం అవుతున్న విషయం. అలాంటిది ఏదైనా ఉంటే వాటిపై సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు సంప్రదించాలని గ్రామస్తులకు తెలిపారు. అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని ఆరోపించాలని సూచించారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు,