జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అధికారానికి అనర్హుడు. అహంకారానికి సరిజోడు.. అవినీతిలో అగ్రజుడు జగన్. పుల్లారావు. 40 లక్షల ఉద్యోగాలిస్తే పట్టభద్ర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు పుల్లారావు. అబద్ధాలు.మోసాలు.. హత్యా రాజకీయాలతో ముఖ్యమంత్రి పదవి దక్కించుకొని, 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచేసి, తమ జీవితాలకు సున్నా చుట్టాడనే జగన్ కు, వైసీపీకి జనం సున్నం బొట్లు పెట్టి మరీ సాగనంపారు. యువతను, నిరుద్యోగుల్ని తానే ఉద్ధరించినట్టు జగన్ మాట్లాడటం హాస్యాస్పదం.40 లక్షల ఉద్యోగాలిస్తే వైసీపీ పట్టభద్ర ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదో జగన్ చెప్పాలి. అధికారంలో ఉంటే ఎప్పుడైనా హామీలు అమలుచేయొచ్చని గతంలో చెప్పిన జగన్.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం దిగజారుడుతనం కాదా? హామీల అమలుగురించి మాట్లాడే నైతికత జగన్ కు లేదు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోంది. పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఎన్ని హామీలిచ్చి… అధికారంలోకి వచ్చాక ఎన్ని అమలు చేశాడో ప్రజల్లోకి వచ్చి జగన్ చెప్పగలడా? ముఖ్యమంత్రిగా పరదాల చాటున.ఇప్పుడేమో నాలుగ్గోడల మధ్యన అదే జగన్ కు తెలిసిన పాలన. అధికారానికి అనర్హుడు.. అహంకారానికి సరిజోడు.. అవినీతిలో అగ్రజుడు జగన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్.ఎమ్మెల్యే పదవికే ఎక్కువనే వాస్తవం ప్రజలకు అర్థమయ్యే, ఒక్కఛాన్స్ ను చివరి ఛాన్స్ చేసి జగన్ ను ప్యాలెస్ లకు పరిమితం చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవలో భువనేశ్వరి గారు తనకు తానే పోటీ పడుతున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలకు రాష్ట్రంలో పునాది పడటం పేదలకు వరమనే చెప్పాలి. ట్రస్ట్ కార్యకలాపాలతో భువనేశ్వరి సమాజసేవలో తనకు తానే పోటీ పడుతుండటం తెలుగుజాతి గర్వించాల్సిన విషయం. చంద్రబాబు రాష్ట్ర పురోగతి.. ప్రజాసంతోషం కోసం శ్రమిస్తుంటే, భువనేశ్వరి పేదల ఆరోగ్యం కోసం, సమాజహితం కోసం పాటుపడటం నిజంగా అభినందనీయం.అని పుల్లారావు తెలిపారు.