ప్రతి భక్తునిలో రామనామం ఉప్పొంగి పోతుంది. రాములోరి కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్న అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, మార్చి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్పంతో గ్రామ, గ్రామాన కోటి తలంబ్రాల దీక్షను అద్భుతంగా నిర్వహిస్తుంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ . ప్రతి భక్తుడు కూడా రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి వాటిని తలంబ్రాలుగా మార్చి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు,కి అక్కడే అందజేస్తున్నారు. మేము భద్రాచలం వెళ్లలేక పోయినా మేము భక్తితో ఓలిచి అందిస్తున్న మా తలంబ్రాలు భద్రాచల సీతారాముల పాదాల వద్దకు చేరడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం అని భక్తులు ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ సంవత్సరం భద్రాచల సీతారాముల కల్యానానికి 250 కిలోల గోటి తలంబ్రాలను అందించాలనే దృఢ సంకల్పంతో మేము నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి భక్తుడు పాల్గొంటున్నారని సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. గోటి తలంబ్రాలు కావలసిన రామకోటి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.