మిఠాయిలు పంచి సంబరాలు చేసిన నాయకులు కార్యకర్తలు
మార్చి 6 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బిజెపి శ్రేణులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు సాధించిన సందర్భంగా బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచడం జరిగినది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామెల్ల రాజశేఖర్ గారు.మాట్లాడుతూ మన బిజెపి పార్టీ మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసింది. అందులో రెండు బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఒకటి పట్టభద్రులు శ్రీ అంజిరెడ్డి గారు రెండవది టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీ మల్కా కొమరయ్య గారు గెలుపొందడం జరిగింది. ఈ విజయంతో ఉపాధ్యాయ సంఘాల్లో బిజెపి పార్టీపై ఉన్న అపారమైన విశ్వాసం నమ్మకం మరింత బలపడిందన్నారు. భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచిన తెలంగాణ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల విజయం కోసం నిత్యం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బిజెపి పార్టీ ఏ ప్రత్యామ్నాయం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ నెంబర్ బొల్లె సునీల్ గారు, జిల్లా సీనియర్ నాయకులు హేమ సుందర్ గారు, జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం. ఉపాధ్యక్షుడు చిట్టెం ఈశ్వరరావు గారు. యువ మోర్చా అధ్యక్షుడు నోముల శ్రీ కిషన్ గారు. మండల సీనియర్ నాయకులు సంతోష్ . తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది