భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జనం న్యూస్,మార్చి06, అచ్యుతాపురం: మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక మెయిన్ రోడ్డు చేపలు మార్కెట్ వద్ద ఎస్పీశేఖర్,రాజమ్మ దంపతుల కుమారులు నగేష్,గణేష్,బాబ్జిలు సుమారు రూ.23 లక్షలతో కొత్తగా నిర్మించిన గంటాలమ్మ ఆలయం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అర్చకుల సమక్షంలో గురువారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. గ్రామ పెద్దలు, భక్తులు వందలాది మంది విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సాయంత్రం తప్పెటగుళ్లు,కోలాటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మందుగుండు సామగ్రిని కాల్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.