సిసి రోడ్డు నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలి గ్రామస్తులను కోరిన సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు జనం న్యూస్ మార్చి 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- మునగాల లోని గణపవరం క్రాస్ రోడ్ నుంచి కస్తూర్బా పాఠశాల వరకు ఏర్పాటు చేస్తున్న డబుల్ సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు కోరారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మరియు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో ఆర్ అండ్ బి శాఖ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే అని అన్నారు. ఈ సిసి రోడ్డు నిర్మాణం రెండు వైపులా కలిపి 7 మీటర్ల వెడల్పున పోస్తున్నందున అక్కడక్కడ కొంతమంది ఇంటి యజమానులు,షాపుల ఓనర్లు గతంలో ఉన్న రహదారి నీ ఆనుకొని షాపులు ముందర రేకుల షెడ్లు వేసుకున్నందున వాటిని కొద్ది వరకు తొలగిస్తే మరింత వెడల్పు రోడ్డు పోసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఒకవైపు సైడు రోడ్డు పూర్తికావస్తునందున రెండోవైపు వేసే సమయంలోనైనా ఆ వైపు ఉన్న యజమానులు ఆఫీసర్లకు, కాంటాక్ట్‌లకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండటంతోపాటు వాహనదారులు రహదారులపైనే బైకులు పెట్టకుండా మార్జిన్ రోడ్డు వరకైనా తాము ఏర్పాటు చేసుకున్న షాపులను ఎవరికి వారు స్వచ్ఛందంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేయించాలని ఆర్ అండ్ బి ఏ ఈ సత్యనారాయణ ను కోరడం జరిగింది.