జనం న్యూస్ జనవరి 12 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల పర్యాటక ప్రాతంలో ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా శనివారం బొర్రా, అనంతగిరి, ఎగువ శోభ , బీసుపురం, కాఫీ ప్లాంటేషన్ మెయిన్ రోడ్డు వద్ద పారిశుధ్య పనులను ఎంపీడీవో ఏవి కుమార్, విస్తరణ అధికారి లాలం సీతయ్య కలిసి పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ బొర్రా, అనంతగిరి, ఎగువ శోభ, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ అపరిశుభ్రంగా ఉండకుండా ప్రధాన రహదారిలో పరిసరల ప్రాంతం పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూడాలని ఆదేశించారు.