జనం న్యూస్, మార్చి 07,(పెద్దపల్లి జిల్లా ప్రతినిధి)రామగిరి మండలం పన్నూరులో నూతన భవనంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని సుమారు 205 మంది పేద విద్యార్థినిలు చదువుచున్నారు. ఈమధ్య సందర్శించిన భద్రకాళి ఆలయ అర్చకులు డాక్టర్ సముద్రాల విజయ సారథి మాధవి దంపతులు విద్యార్థులందరు మంచి జ్ఞానం సంపాదించి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడులు సాధించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షిస్తు సెంటినరీ కాలనీలోని భద్రకాళి ఆలయంలో పూజ చేసిన బుక్కులు, పెన్నులను, అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన స్వీటు అందజేశారు. ప్రతి విద్యార్థికి హైస్కూల్ దశలో నేర్చుకున్న క్రమశిక్షణతో ఉన్నత స్థాయిలో నిలపెడుతుందని, అమ్మవారి ఆశీస్సులతో అందరు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా అందరిని దీవించుతూ నోటుబుక్కులు, పెన్నులు, స్వీటు అందజేశారు. విద్యార్థులందరికీ సౌకర్యాలతో పాటు మంచి చదువు నేర్పుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. మరో 14 రోజులలో పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి దాయక సందేశాన్నిస్తూ 10 గ్రేడ్ సాధించేవరకు కష్టపడి చదవాలని కోరారు. వారికి అన్ని విధాలకు సహాయపడుతు, మంచి చదువు నేర్పుతున్న ఉపాధ్యాయులందరినీ శాలువాలతో సన్మానించి, అమ్మవారి ప్రసాదంగా పెట్టిన పండ్లు అందజేశారు. పాఠశాలలో సహాయకులుగా పనిచేస్తున్న వారందరికీ అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. పాఠశాల ఇన్చార్జి మంజుల మాట్లాడుతూ పిల్లలకు స్పూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చి వారిలో చదువుపై మరింత శ్రద్ధ కలిగేలా కార్యక్రమం నిర్వహించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో పాటు కృతజ్ఞతలు తెలిపారు.