జనం న్యూస్ మార్చి7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం లో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణార్థం చేసే గోటి తలంబ్రాల వడ్లను చేతితో వలిచి ఆ బియ్యంను శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో తలంబ్రాలుగా సమర్పిస్తాము ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరు ఇంటి నుండి ఒక పాత్ర ప్లేట్ ని శ్రీ కనక దుర్గమ్మ దేవాలయానికి తీసుకొని రావాలని విన్నపము. మీరు తెచ్చిన పాత్రలో ధర్మ జాగరణ సమితి వారు తెచ్చిన వడ్ల గింజలను మీకు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయం ప్రాంగణం లో జరుగు కార్యక్రమం లో పాల్గొనే మహద్భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్న ధర్మ జాగరణ సమితి. మిగతా వివరాలకు నామాల శ్రీనివాస్ నేత భొములే శంకర్ వారిని సంప్రదించవలెను