అన్ని రంగాల్లోనూ అతివలదే పోటీ , వారికి ఎవరు రారు సాటిజిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన జిల్లా డివి
శ్రీనివాసరావు జనం న్యూస్ మార్చ్ 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా ఎస్పి మహిళ పోలీస్ అధికారులు సిబ్బందికి ముందస్తు గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రస్తుత రోజుల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా, విద్య, వైద్య ,పారిశ్రామిక, అంతరిక్ష ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలదే పోటీ అని, వారికి ఎవరు సాటి రారని కీర్తించారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ, ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు. పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, కృషితో ఉద్యోగాలలో మరియు ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతంగా ఆలోచించిన మహిళ తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా పోలీస్ శాఖలో తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత తోటే అభివృద్ధి సాధ్యం అని, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. అనంతరం మహిళా పోలీస్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, , ఆర్.ఐ అడ్మిన్ పెద్దన్న, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ , ఆసిఫాబాద్ సి.ఐ రవీందర్,ఎంటీఓ ఆర్ ఐ అంజన్న, ఎస్.ఐ లు తేజస్విని , సౌమ్య, తిరుమల, శిరీష మరియు భరోసా కేంద్రం, షీ టీం, ఐటీ కోర్, డి సి ఆర్ బి, సఖి సెంటర్ ల సిబ్బంది, మహిళ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.