జనం న్యూస్ 8 3 2025 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం చేయ్యెరుకి చెందిన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగిగా పనిచేయడం వరంగా భావిస్తున్నారు. రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట గురించి అందరికి తెలిసిందే. ఇది మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉంది. మహిళ దినోత్సవ సందర్భంగా సైంటిస్ట్ చిక్కం తేజస్వని మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కేంద్రంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. ఇస్రో వరుస విజయాలతో అంతరిక్ష రంగం లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. చెయ్యేరు గ్రామానికి చెందిన చిక్కం కాశీ విశ్వేశ్వరరావు, సత్యవతి దంపతుల కుమార్తె అయిన తేజస్విని
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చెయ్యేరు వివేకానంద పబ్లిక్ స్కూల్, 6 నుండి 10వ తరగతి వరకు ఆదిత్య స్కూల్ అమలాపురం, పాలిటెక్నిక్ విద్యను ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ అనాతవరం, ఇంజనీరింగ్ చదువును బివిసి భట్లపాలెంలో పూర్తిచేశారు.నేటి యువతరానికి ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు.