జనం న్యూస్ 08 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గంజీపేట రాజు ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జడ్పీటీసీ,బాసు శ్యామల, హనుమంతు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని గద్వాల జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల వసతి గృహం నందు శనివారం మహిళా దినోత్సవం వేడుకలు BRS పార్టీ యువ నాయకులు గంజిపేట రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల,హనుమంతు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై,కళాశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు..స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యార్థినులు ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చాలా గొప్ప పనిచేశారని, భారత రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని అన్నారు.మహిళలందరూ పురుషులతో పోటీ పడుతూ అన్నిరంగాలలో ముందుకు సాగాలని బాసు శ్యామల పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో మల్దకల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు డి.శేఖర్ నాయుడు,తిరుమలేష్,వీరేష్ గౌడ్,ఆకే పోగు,రాజు,గంగాధర్,ప్రవీణ్,వెంకటేష్,మన్యం,ఉరుకుందు,కామేష్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..