జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహిళా హక్కుల రక్షణ కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి మై రమణమ్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం IBG నగర్లో ఆమె మాట్లాడుతూ… దేశంలోని రోజురోజుకి మహిళలు పై దాడులు, హింస పెరుగుతుందన్నారు. మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురౌతున్నారని తెలిపారు. వీటి నుంచి రక్షణ పొందాలంటే మహిళలు హక్కుల కోసం ఉద్యమించాలని తెలియజేశారు.