జనం న్యూస్ మార్చి(8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలం సూర్య తండ గ్రామంలో శనివారం నాడు తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసినాడు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ బావులు బోర్లు నీళ్లు లేక అడుగంటుపోయి ఎస్సారెస్పీ కాల్వ జలాలు రాక పంట పొలాలు ఎండిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసినాడు. వరి పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25వేల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేసినాడు ఈ కార్యక్రమంలో సూర్య తండా మాజీ సర్పంచ్ యాకు నాయక్, మాజీ ఎంపిటిసి మాన్సింగ్ నాయక్, రైతులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.