జనంన్యూస్. 08. నిజామాబాదు. సిరికొండ. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మహిళలపై జరుగుతున్న దాడులకు, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుదాం.
పి. వో. డబ్ల్యూ. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి ప్రగతిశీల మహిళా సంఘం( పి. వో. డబ్ల్యూ. ) ఆధ్వర్యంలో మహిళలతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో పి. వో. డబ్ల్యూ. డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో "భీడీలు చుట్టుట, కుర్చీ" తదితర క్రీడాలను నిర్వహించారు. ఈ సందర్బంగా పి. వో. డబ్ల్యూ. . రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి.మాట్లాడుతు:
అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఆవిర్భవించి నేటికీ 114 సంవత్సరాలు అయింది. పనిగంటల తగ్గింపు కోసం పని స్థలాల్లో కనీస వసతుల కోసం మెరుగైన వేతనాలు కావాలని ఓటు హక్కు కోసం 1850 దశకం తర్వాత కాలంలో మహిళలు పోరుబాటపట్టారు. ఆనాడు ఎంతోమంది మహిళలు వీర మరణం పొందారు. నేడు భారతదేశంలో మహిళలపై అనేక రకాల దాడులు, పరువు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న దుస్థితి ఉన్నది. నిర్భయ లాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నా ప్రభుత్వాలు నామమాత్రపు చట్టాల పేరుతో చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. మార్చి 8 అంతర్జాతీయ పోరాట దినం స్ఫూర్తితో సమాజంలో కులరక్కసిని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రజల్లో అసమానతులను అనైక్యతను సృష్టించడమే గాక మహిళలపై మరింత అణచివేతకు హింసకు పురుగల్పే మనువాద భావజాలాన్ని మహిళలపై జరుగుతున్న దాడులకు హత్యలకు వ్యతిరేకంగా మహిళలోకం నడుంబిగించాల్సిన సమయం వచ్చింది. ఆడదంటే అబల కాదు సబల అని సవాల్ చేస్తూ మార్చి 8 స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, పి. వో. డబ్ల్యూ. జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తేవ్వ, డివిజన్ అధ్యక్షురాలు పి. రమ, సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ లు ప్రసంగించగా, పి. వో. డబ్ల్యూ. సిరికొండ మండల కార్యదర్శి ఆర్. పుష్పలత అధ్యక్షత వహించాగా జిల్లా నాయకులు సునంద, జి. పద్మ, నర్సక్క, బి. మానస, సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు బి. బాబన్న, జి. సాయరెడ్డి, పి. వో. డబ్ల్యూ. డివిజన్, మండల నాయకులు ఎస్. గంగామణి బి. లావణ్య, మల్కి.లత, ఎస్. బాలలక్ష్మి, బి. సావిత్రి, టీ. గంగామణి, పార్టీ మండల నాయకులు బి. కిషోర్, అనిస్ తదితరులు పాల్గొన్నారు.