జనం న్యూస్ 08 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి 38 వ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమ గుండాల పనులు ఇతర కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తున్న పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, మరియు పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరుశురాం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఆలూరు నర్సింలు గుప్తా, ఎర్రగడ్డ పల్లి గోపాల్, పి. సురేఖ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల రఘు మోహన్ రెడ్డి, ఎస్పీ బాబయ్య, మార్కెట్ డైరెక్టర్ శశికళ ఆనందం, చిన్న నరసింహులు, కుడుముల వెంకటేష్, తదితరులు పాల్గొని పనులను పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారధి మాట్లాడుతూ రేపటినుండి జరగబోయే బ్రహ్మోత్సవాల్లో పరిగి నియోజకవర్గ ప్రజలు పరిగి పట్టణ ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని , లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిగి ప్రజలంతా పొందాలని కోరారు.