జనంన్యూస్. 08. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది. గ్రామానికి చెందిన దరాజుల నర్సు. హౌస్ నెంబర్ 5-22 గల కూన ఇల్లు నిన్న అనగా తేది. 07.03.2025 రోజున రాత్రి సుమారు 10గంటల ప్రాంతం లో ఫ్రిడ్జ్ దగ్గర కరెంట్ షార్ట్ సరక్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం సంబవించినది ఇట్టి అగ్ని ప్రమాదం లో ఫ్రిజ్, సోఫా, బెడ్స్, బట్టలు, నిత్యావసర వస్తువులు, 40వేల రూపాయల నగదు కాలిపోయినవి. ఇట్టి అగ్ని ప్రమాధం లో నష్టపోయిన ఇంటిని పరిశీలించిన. మండల అధికారి. కే గంగారాజం. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిరికొండ పరిశీలన చేసి పంచనామా నిర్వహించడం జరిగింది.