జనం న్యూస్ మార్చ్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులు, మాతృ సమానమైన మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారత కోసమే నాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదని సమాజ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. 1995 లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ స్థాయిలో సంస్కరణలు తీసుకొని వచ్చిన తర్వాత సమాజంలో మహిళలు ఆర్థికంగా మగవాళ్లతో సమానంగా ఉండే విధంగా డ్వాక్రా వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రతి మహిళను తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆర్థికంగా సహాయపడ్డారని, నేడు ప్రతి మహిళ బ్యాంకుల నుండి లక్ష రూపాయలు రుణాలు తీసుకొని చెల్లిస్తున్నారని, బ్యాంకులకు నూటికి నూరు శాతం రికవరీ మహిళల వల్లే జరుగుతుందని వెంకటరావు అన్నారు. 4 వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025 -26 మహిళా శిశు సంక్షేమానికి 4,332 కోట్లు కాటేయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దీపం పథకం ద్వారా 90 లక్షల పైబడి లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారని, అలాగే ఆశా వర్కర్లు కు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రస్తుత సెలవు, గరిష్ట వయోపరిమితి 60- 62 ఏళ్లకు పెంపు, నిబంధనల ప్రకారము గ్రాట్యూటీ, ప్రతి నెల 10,000 రూపాయలు వేతనo, గ్రాట్యూటీ కింద సుమారు 1.5 లక్షలు అందించే అవకాశం, దీని ద్వారా 42, 752 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని వెంకటరావు అన్నారు. మరో ఎన్నికల హామీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారని, రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యూటీ పెంపు, అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయలు వర్కర్స్ కు 40,000 గ్రాట్యుటీ చెల్లింపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకారం ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు కానుక ప్రకటించారని, గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హెల్పర్లు, అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం నిర్బంధంగా వారి హక్కులను హరించి, అక్రమ కేసులు పెట్టి వేధించారని, నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం నేడు వారందరకి కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని వెంకటరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిఎస్ చైర్మన్ కోట్ని ఉమా, టౌన్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాయల ప్రసన్నలక్ష్మి ఎస్సీ సెల్ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు కూరాకుల భారతి ఎస్సీ నాయకురాలు లక్ష్మీ ప్రభ తదితరులు పాల్గొన్నారు.