జనం న్యూస్ 8 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం శాంతినగర్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ పిటి రిజినాను ఘనంగా సన్మానించిన పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతి ఉపాధ్యాయినీలు ఘనంగా సత్కరించారు. రెజీనా మాట్లాడుతూ. విద్యార్థినీలు క్రమశిక్షణతో చదువు పట్ల దృష్టి సారించాలని సోషల్ మీడియా ఇతర ప్రాలోభాలకు లోను కావద్దని మహిళా శక్తికి మించిన శక్తి లేదని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినీలు స్క్రిట్లు. నృత్యాలు చేసి అందరిని ఆనందింప చేశారు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయినీలను శాల్వాలతో బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ సౌభాగ్య, సిస్టర్ రాణి, సిస్టర్ జ్యోతి, ఏ ప్రమీల, టి రేవతి, ఎం సుమాంజలి, అనిత, పి భవాని, ఎం శ్రావణి, నవ్య, సుమతి, హారతి, ఉషారాణి, మౌనిక, అన్నపూర్ణ, నీరజ, విద్యార్థులు విద్యార్థినీలు పాల్గొన్నారు