జనం న్యూస్ 09 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళా హోంగార్డు కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రివర్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 2025న విజయనగరం పట్టణం పోలీసు క్వార్టరు నివాసంలో ఉంటున్న సీనియర్ మహిళా హోంగార్డు ప్రమీల ఇంటిని రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తూ, తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళా హోంగార్డు
కుటుంబ సభ్యుల యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో మహిళ పోలీసు ఉద్యోగులు, హెూంగార్డు జీవన శైలి ఏవిధంగా ఉంటుందని స్వయంగా తెలుసు కొనేందుకుగాను తాను మహిళా హెూంగార్డు ప్రమీల ఇంటిని సందర్శించడం జరిగిందన్నారు. అనంతరం హోంగార్డు ప్రమీలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి చీర, పండ్లను అందజేసారు. హెూంగార్డు ఇంటిలో మంత్రివర్యులు కాఫీ సేవించి, ఆమె మనవడితో కాసేపు కుశల ప్రశ్నలు వేసి, హోంగార్డు సర్వీసు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, విధి నిర్వహణలో ఇబ్బందులు అడిగి తెలుసుకొని, వారింటిలో కొంత సమయంను హెూంశాఖ
మంత్రివర్యులు వంగలపూడి అనిత గడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఎమ్మెల్యే అధితి విజయలక్ష్మి గజపతిరాజు, ఒఎస్టి అనిల్ పులిపాటి, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.