ప్రాణాలు కాపాడిన డాక్టర్ చందన.. జనం న్యూస్ // మార్చ్ // 9 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని గ్రామంలోని వావిలాల-తనుగుల మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోరపల్లికి చెందిన శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తుండగా ఓ కారు ఢీకొట్టింది. డాక్టర్ చందన సమయస్ఫూర్తితో స్పందించి ఘటనాస్థలిలోనే ఉన్న వావిలాల డాక్టర్ మొలుగు చందన క్షతగాత్రులకు తక్షణమే ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల ప్రశంసలు ఈ ఘటనలో డాక్టర్ చందన సమయస్ఫూర్తి, సేవాభావానికి ప్రయాణికులు అభినందనలు వ్యక్తం చేశారు.వైద్య వృత్తి తనకు తృప్తినిస్తుంది. అని డాక్టర్ చందన పేర్కొన్నారు.