జనం న్యూస్,మార్చి09,అచ్యుతాపురం:యలమంచిలి నియోజకవర్గం మునగపాక గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల రథం ముహూర్తమును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ చేతుల మీదుగా చేయడం జరిగింది.రాంబిల్లి మండలం గోవిందపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామస్వామి వారి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో బొడ్డేడ ప్రసాద్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు మరియు రాంబిల్లి మండలం ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.