జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అన్నమాచార్య పి జి కాలేజ్ అఫ్ కంప్యూటర్ స్టడీస్ ప్రిన్సిపాల్ డా. డి జె సమతా నాయుడు విద్య రంగం, సమాజ సేవ మరియు మహిళా అభ్యున్నతి కి గాను ను చేసిన సేవ కార్యక్రమాలను గుర్తించి నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు గాను వివేకానంద సేవాశ్రమం, ఓబుళాపురం గ్రామం, యస్.ఎ. కాశినాయన (మం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ధాత్రి పురస్కారంతో సత్కరించారు. వీరి తో పాటు వినిశెట్టి జగదీశ్వరయ్య మెమోరియల్ సేవ సంస్థ , హనుమకొండ, తెలంగాణ ఇన్స్పిరేషనల్ ఊమెన్ ఆవార్డ్ తో సన్మానించి అభినందించారు. ప్రస్తుత సమాజం లో వీరి ని ఆదర్శం గా తీసుకొని మహిళలు అన్ని రంగాలలో అభివృధి చెందాలి అని వివేకానంద సేవాశ్రమం వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి కొనియాడారు. తనకు అవార్డు ప్రధానం చేసిన వారికి, తనను ప్రోత్సహించిన అన్న మాచార్య విశ్వవిద్యాల యాజమాన్యం కి మరియు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్భంధికి సమతా నాయుడు ప్రత్యక కృతజ్ఞతలు తెలియ జేశారు.