జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మార్చి 9 :మండపేట నియోజకవర్గ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండపేట నియోజకవర్గ సన్నాహక ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండపేట నియోజక వర్గ జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మండపేట సూర్య కన్వర్షన్ హాల్ లో జన సేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మండపేట నియోజకవర్గ జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించబోయే జనసేన పార్టీ 12వ అవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 9గంటలకు మండపేట శ్రీ సూర్య కన్వెన్షన్ హాలు లో జనసేన సన్నాహక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నలుమూలల నుంచి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.