జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్పీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.