జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారి అధ్యక్షతన ఆదివారం విజయనగరం జిల్లా కేంధ్రంలోని ఐఎంఏ పంక్షన్ హాలులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సన్నాహాక సభ జరిగింది. 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ తో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకకు విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు హాజరయి విజయవంతం చేయాలని కోరారు. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం జరిగే పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వేధిక వద్ద లక్షలాదిగా తరలివచ్చే జనసైనికుల కోసం ఇప్పటికే అధిష్టానం ఏర్పాట్లు చేసిందన్నారు. మిగిలిన రాజకీయ పార్టీలకయితే జనాలను తరిలించాలని, జనసేన పార్టీకైతే జనసైనికులు స్వతహాగా కదిలి వస్తారని అన్నారు. విజయనగరం పార్లమెంట్ నుండి అత్యధికంగా అవిర్భావ సభకు హాజరై జిల్లా సత్తాను చాటుదామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ను విడుదల చేశారు. సమావేశంలో జనసేన నాయకులు, పిఓసిలు సభను విజయవంతం చేయాలని కేడర్ ను కోరారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పిఓసి లు, మండల నాయకులు, పట్టణ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.