ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి.. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు.. జనం న్యూస్// మార్చ్ // 10 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణం లోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది..పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ డిసీజెస్ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రైడే మీద టిబి నిక్షయ్ శివిర్ 100 రోజుల ప్రణాళికలో టిబి మీద అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులమని ఎవరు అధైర్య పడవద్దని మనోధైర్యంతో అధికమించాలని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని విద్యార్థులకు మనోధైర్యాన్ని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు కల్పించారు. ఈ వైద్య శిబిరంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ మహోన్నత పటేల్, శ్యాం నాయక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్ అరుణ, పాఠశాల ప్రిన్సిపాల్ రాజు ఆరోగ్యశాఖ సిబ్బంది సరళ,రజిత మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.