జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) విద్యార్థులు స్వీయ అనుభవం ద్వారా ఎంతో నైపుణ్యతను సాధిస్తారని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు.మంగళవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు..విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో ఉపాధ్యాయులను అనుకూరిస్తున్నట్లు విద్యార్థులకు పాఠాలు చెప్పారు వారి యొక్క అభినయాలు ఉపాధ్యాయులను పోలి ఉండటం సంతోషాన్నిచ్చిందని తెలిపారు.